Written by Administrator
ముఖ్య వార్తలు
జఫిర్లుకాస్ట్ మాత్రలు ప్రవేశపెట్టిన Dr. Reddy’s
Dr. Reddy’s జఫిర్లుకాస్ట్ మాత్రలు (10 mg/20 mg) ప్రవేశ పెట్టింది. ఇవి అమెరికా మార్కెట్లోని అకోలేట్ ఆర్ అను మందుకి సమానమయిన ఫలితాలు ఇస్తాయి. అమెరికాలో అకోలేట్ ఆర్ మందులు సంవత్సరానికి 50 మిలియన్ డాలర్లు అమ్ముడుపోతాయి. ఇది Dr. Reddy’s కి లాభాదయకమయిన విషయం.
ఫోర్టిస్: 400 కోట్లతో 7 నూతన ఆసుపత్రుల ప్రణాళిక
ఫోర్టిస్ వచ్చే రెండు సంవత్సరాలలో 400 కోట్లతో 7 నూతన ఆసుపత్రులు ప్రారంబించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీనితో ప్రస్తుతం ఉన్న 6000 పడకల సామర్ధ్యంకు అదనంగా 2500 నుండి 3000 పడకలు చేర్చబడతాయి.
స్వైన్ ఫ్లు నియంత్రణకి భారత్ సిద్ధం:
కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ స్వైన్ ఫ్లు నియంత్రణకోసం భారత్ సర్వ సన్నిద్ధంగా ఉందని ప్రకటించింది. స్వైన్ ఫ్లు వ్యాధి చికిత్స కోసం రెండు రకాల మందులు దేశం లో తాయారు చేయబడుతున్నాయి. దీనికి ఆరు ఫార్మా కంపనీలు లైసెన్స్ పొందాయి. అదనంగా మూడు కంపనీలు స్వైన్ ఫ్లు వ్యాధి నివారణ కోసం వాక్సిన్ తయారికి లైసెన్స్ లు పొందాయి. కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి గులాం నభి ఆజాద్ పార్లమెంట్ ప్రకటన ప్రకారం H1N1 (స్వైన్ ఫ్లు) చికిత్స కోసం సిప్లా, హెటెరో డ్రగ్స్, నాట్కో ఫార్మా, రాన్ బాక్సీ లాబ్స్ మరియు కాడిలా ఫార్మా కంపనీలు ఒసల్టామివార్ మరియు సంబంధిత మందులు తయారు చేస్తున్నాయి. వ్దీనితో పాటు సిప్లా జానమివీర్ అన్న మందును కూడా తాయారు చేస్తుంది.
2015 సంవత్సరం లో మందుల మార్కెట్లో చైనది రెండవ స్థానం –IMS హెల్త్
IMS హెల్త్ అంచనాల ప్రకారం 2015 కల్ల చైనా ప్రపంచం లోనే రెండవ పెద్ద ఫార్మస్యుటికల్ మార్కెట్ అవుతుంది. ఆర్దికాభివ్రుది మరియు ఆరోగ్య శాఖ విధానాల సరళీకృతం వాళ్ళ వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగి ఇందుకు దోహదపడుతుంది. వచ్చే సంవత్సరం చైనా మందుల అమ్మకాలు 25-27% పెరిగి 50 బిలియన్ డాలర్లు చేరుతాయి. దీనితో చైనా మార్కెట్ అమెరికా మరియు జపాన తరువాత మూడవ స్థానం లో నిలుస్తుంది.


