ఆటోమోబైల్స్

ఇండియాలో రెట్టింపు అమ్మకాలే లక్ష్యం :డ్యుకాటి

ఇటలీకు చెందిన ప్రముఖ లగ్జరీ బైక్‌ల తయారీ సంస్థ 'డ్యుకాటి' భారత మార్కెట్లో విక్రయాలను రెండింతలకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు ప్రకటించింది. భారత్‌లో ప్రిమీయం వాహనాలకు డిమాండు పెరుగుతుండటంతో ఈ ఏడాది తమ మోటార్‌సైకిళ్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ ఏడాది 200 డ్యుకాటి మోటార్‌సైకిళ్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ఆసియా పసిఫిక్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మిర్కో బోర్డిగా తెలిపారు. 2010లో డ్యుకాటి భారత్‌లో 100 ప్రిమీయం మోటార్‌సైకిళ్లను విక్రయించింది.భారత మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని, కొత్త మోటార్‌సైకిల్ తయారీదారుల భారత్‌కు రావడంతో మార్కెట్ మరింత వృద్ధి చెందిందని బోర్డిగా తెలిపారు.
ఇప్పుడప్పుడే భారత్‌లో అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసే ఆలోచన లేదని ఆయన అన్నారు. భారత మార్కెట్లో ఇప్పటికే హ్యార్లీ డేవిడ్‌సన్, సుజుకి మోటార్ కార్ప్, కవాసకి, యమహా మోటార్, బిఎమ్‌డబ్ల్యూ వంటి కంపెనీలు ప్రిమీయం బైక్‌లను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు తాజాగా బ్రిటన్‌కు చెందిన మరో కొత్త కంపెనీ ట్రైయంప్ కూడా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.2008లో డ్యుకాటి భారత్‌లో విక్రయాలను ప్రారంభించింది. ప్రస్తుతం 15 మోడళ్ల హై-పెర్ఫామెన్స్ మోటార్‌సైకిళ్లను దేశీయ మార్కెట్లో అందిస్తోంది. వాటిల్లో సూపర్‌బైక్ 1098ఆర్ మరియు హైపర్‌మోటార్డ్ 1100ఎస్ వంటి మోడళ్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఇటీవలే మరో లగ్జరీ బైక్ డయావెల్‌ను కూడా విడుదల చేసింది.

 

ప్యుజో సిట్రాన్ అధికారులు జయ సర్కారుతో భేటి

ప్రెంచ్ దేశానికి చెందిన ప్రపంచపు రెండో అతి పెద్ద కార్ల తయూరీ సంస్థ పీఎస్‌ఏ ప్యూజో సిట్రాన్ తిరిగి భారత్‌ మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇది  గత పదేళ్ల క్రితమే  భారత ఆటోమొబైల్ మార్కెట్‌ నుంచి వైదొలగినది.అయితే, సంస్థ కేవలం తమ ఉత్పత్తులను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టడమే కాకుండా.. భారత్‌లోనే స్వతాహాగా వాటిని ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.
భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్లాంటు ఏర్పాటు చేస్తే లబ్ధిదాయకంగా ఉంటుదనే అంశంపై కంపెనీ మార్కెట్ అధ్యయనం చేస్తుంది. ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మరియు తమిళనాడు ప్రాంతాలలో స్థాలాల కోసం కంపెనీ అన్వేషిస్తుండగా, తాజాగా వచ్చే వారం తమిళనాడు ప్రభుత్వంతో కంపెనీ ఉన్నతాధికారుల బృందం భేటీ కానుంది.గతంలో తమిళనాడులో ప్లాంటు ఏర్పాటు చేయాలని కంపెనీ భావించినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కరుణానిధి ప్రభుత్వంతో తమ రాయబారాన్ని కంపెనీ విరమించుకుంది.
ప్రస్తుతం తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో, ప్యూజో చర్చలకు సిద్ధమైంది. తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతుండటం, అన్ని రకాల రవాణా సదుపాయాలను కలిగి ఉండటంతో ప్యూజో వీలైనంత వరకూ ఆ రాష్ట్రంలోనే ప్లాంటును ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇది ప్యూజో కంపెనీకు జయలలిత ప్రభుత్వం ప్రకటించే రాయితీలపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వంతో ప్యూజో ఉన్నతాధికారుల భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది.

 

గత నెల మే లో రెండింతల వృద్దిని సాదించిన" ఆడి "

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఆడి ఇండియా గత నెల విక్రయాలలో రెండితల వృద్ధిని సాధించి శభాష్ అనిపించుకుంది. మే 2011లో ఆడి విక్రయాలు 104 శాతం వృద్ధి చెంది 408 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు కేవలం 200 యూనిట్లుగా మాత్రమే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే జనవరి-మే 2011 కాలానికి మొత్తం విక్రయాలు కూడా రెండింతలు పెరిగాయి. ఈ కాలానికి ఆడి ఇండియా మొత్తం విక్రయాలు 1,167 యూనిట్ల నుంచి 2,394 యూనిట్లకు పెరిగాయి. ఓ వైపు ఇంధన ధరలు, వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కంపెనీ పటిష్ట వృద్ధిని సాధించిందని, తమ డీలర్ భాగస్వాములు మరియు నిజాయితీ గల వినియోగదారుల మద్దతుతో 2011 ఆడి ఇండియా ఓ అనిర్వచనీయమై సంవత్సరంగా మిగిలిపోతుందని కంపెనీ హెడ్ మైఖేల్ ప్రెష్కీ తెలిపారు.
భారతీయులలో పెరుగుతున్నటువంటి అభిరుచికి అనుగుణంగా లగ్జరీ కార్ల పై మోజు పెరుగుతుండడంతో వాటి యొక్క వినియోగం ఎక్కువయ్యింది. దీనితో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగినాయి . గతంలో భారతదేశంలో రెండు-మూడు లగ్జరీ కార్ల కంపెనీలు మాత్రమే ఉంటే ఇప్పుడు నెలకో కంపెనీ చొప్పున భారత్‌లో తమ దుకాణాలు పెట్టేస్తున్నాయి. పోటీ పోటీగా మోడళ్లను దింపుతూ చౌక ధరలకే వాహనాలను అందిస్తున్నాయి. అయితే ఇంతటి పోటీతత్వ మార్కెట్లో కూడా కొన్ని కంపెనీలు తమ బ్రాండే గ్రేట్ అనిపించుకుంటున్నాయి. అలాంటి బ్రాండ్‌లలో ఆడి కూడా ఒకటి.

   

గ్రామీణ ప్రాంతాలలోకి పట్టు కోసం టివీస్ నుండి మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్

ప్రముఖ ద్వి చక్ర వాహన  తయారి సంస్థ టివీస్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై కన్నేసింది . అందుకోసం ఆయా ప్రాంతలకనుగునంగా  రోడ్లను దృష్టిలో ఉంచుకొని మరో కొత్త బైక్‌ను ప్రవేశపెట్టింది. టీవీఎస్ ఇటీవల పరిచయం చేసిన మ్యాక్స్4ఆర్ మోటార్‌సైకిల్‌లో మరో కొత్త వేరియంట్ 'మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్‌'ను కంపెనీ విడుదల చేసింది.ఈ బైకు సౌకర్యం మరియు భద్రత విషయాల్లో మ్యాక్స్4ఆర్ మాదిరిగానే కూడా మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్‌ కూడా హామీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. 109.7సిసి ఫోర్-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్-ఇంజన్‌తో లభ్యమయ్యే మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్‌ అధిక టార్క్‌ను విడదల చేస్తూ మంచి పికప్‌ను కలిగి ఉంటుంది.సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఈ బైక్ సీటును పొడవుగా మెత్తని కుషన్లతో రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్ మోటార్‌సైకిల్ మొబైల్ చార్జర్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. విద్యుత్ కోతలున్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ మోటార్‌సైకిల్ ద్వారా మొబైల్ ఫోన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చునని కంపెనీ తెలిపింది. మ్యాక్స్4ఆర్ ఎల్ఎక్స్ రెండు రంగుల్లో ఆకర్షనీయమైన గ్రాఫిక్స్‌తో లభిస్తుంది.

 

బంగ్లాదేశ్ రోడ్ రవాణా సంస్థ నుండి 23 మిల్లియన్ డాలర్ల ఆర్డర్ ను పొందిన అశోక్ లేలాండ్

చెన్నయ్‌కు చెందిన భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ (హిందుజా గ్రూప్‌‌ కంపెనీలో ఓ భాగం) ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలు మాత్రమే కాకుండా.. అత్యవసర మరియు మిలటరీ వాహనాలను కూడా తయారు చేస్తుంది.  బంగ్లాదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ (బిఆర్‌టిసి) నుంచి అశోకే లేలాండ్ 23.3 మిలియన్ల డాలర్ల ఆర్డర్‌ను సొంతం చేసుకుంది.ఈ ఆర్డరును బిఆర్‌టిసి  పొందినట్లు అశోక్ లేలాండ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా అశోక్ లేలాండ్ 290 పూర్తిగా నిర్మించిన డబుల్ డక్కర్ బస్సులను బంగ్లాదేశ్ రోడ్డు రవాణా సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.

   

Page 1 of 12

లాగిన్